Woman Reincarnates: బ్రెయిన్ డెడ్ అయినా ఓ మహిళ మరో నలుగురికి ప్రాణదాతగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరించిన వైద్యులు కర్ను లు పాటు విజయవాడ, హైదరాబాద్, ప్రాంతాల్లోని అవయవ గ్రహీతలు ఉన్న ఆసుపత్రులకు చేరవేశారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్నూలు నగరంలో గ్రీన్ చాలా ఏర్పాటు చేశారు.
కర్నూలు నగరంలోని బాలాజీ నగర్ కు చెందిన వీర ప్రతాపరెడ్డికి ముగ్గురు సంతానం. రెండో కూతురు పావనీలత 28 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొల్లాపూర్ మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంది.
రెండున్నర ఏళ్ళ క్రితం కిడ్నీ వ్యాధితో శ్రీనివాసరెడ్డి మరణించుగా ఉద్యోగం కోసం కొద్ది రోజుల క్రితం పావనీలత హైదరాబాద్ కు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఫిట్స్ రాగా స్థానికులు గుర్తించి ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిపించారు. పరిస్థితి విషమించడంతో ఆమె తల్లిదండ్రులు ఈనెల 3న కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
ఆమెకు ఈనెల 5వ తేదీన వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. పావనీలత కోరిక మేరకు ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ఆస్పత్రి సూపండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి సమక్షంలో ఊపిరి తిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి, కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్స్ లో పంపారు.
రెండు మూత్రపిం డా ల్లో కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి ఒకటి, కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి మరొకటి అందించారు. రెండు కళ్ళను కర్నూలు జిజిహెచ్, జీవన్ దాస్ లో రిజిస్టర్ అయిన వారికి అందిస్తామని కర్నూలు కలెక్టర్ తెలిపారు.