Village Was Evacuated: తాడిపత్రి మండలంలో వింత ఆచారం..గ్రామం మొత్తం ఖాళీ చేశారు…ఎందుకో తెలుసా..
అనంతపురం జిల్లా: తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున ఆ గ్రామం మొత్తం ఖాళీ అవుతుంది. గ్రామస్తులతో పాటు మూగజీవాలతో సహా అన్నిటిని తీసుకొని గ్రామాన్ని వీడి అడవిలోకి వెళ్తారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉందని గ్రామస్తులు చెప్పారు. ఆధునిక యుగంలోనూ ఇప్పటికీ ఇలాంటి వింత ఆచారాలు వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఈ సాంప్రదాయాన్ని మాత్రం గ్రామస్తులు ప్రతి ఏటా తూచా తప్పకుండా పాటిస్తారు.
మాఘమాసం పౌర్ణమికి ముందు రోజు గ్రామస్తులందరూ గ్రామాన్ని ఖాళీ చేస్తారు. ఇంటికి తాళాలు వేసి పెట్టే బేడా సర్దుకొని ఇంటిలోని గేదెలను సైతం తోలుకొని అగ్గిపాడు ఆచారం పేరుతో అడవిలోకి వెళ్తారు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే లోపు గ్రామం ఖాళీ చేసి గ్రామస్తులు అడవిలోకి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గ్రామానికి తిరిగి వస్తారు. సంవత్సరంలో మాఘమాసం పౌర్ణమికి ముందు రోజు ఇలా చేస్తే గ్రామానికి ఉన్న అరిష్టాలు తొలగిపోయి గ్రామానికి మంచి జరుగుతుందని తలారి చెరువు గ్రామస్తులు చెబుతున్నారు.
అగ్గిపాడు ఆచారం వెనుక పెద్ద చరిత్ర ఉందని గ్రామస్తులు తెలిపారు. 400 సంవత్సరాల క్రితం తలారి చెరువు గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి దాడి చేసి అందిన కాడికి దోచుకెళ్ళాడట. అతడి ఆగడాలు పెరిగిపోవడంతో గ్రామస్తులంతా కలిసి బ్రాహ్మణుడిని హతమార్చారు. అప్పటినుంచి ఊళ్లో పుట్టిన పిల్లలు చనిపోతూ వ చ్చారట బ్రాహ్మణుడినీ హత్య చేయడం వల్లనే పిల్లలు చనిపోతున్నారని ఓ జ్యోతిష్యులు చెప్పాడట.. ఇలా జరగకుండా ఉండాలంటే మాగ చతుర్దశి అర్ధరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గి వెలుతురు లేకుండా గ్రామం వదిలి దక్షిణ వైపు వెళ్లాలని సూచించారు. అప్పటినుంచి జ్యోతిష్యుడు సలహాతో అగ్గిపాడు ఆచారం ను గ్రామస్తులు పాటిస్తున్నారు.