Chemical Industry : కెమికల్ ఇండస్ట్రీలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం

Chemical Industry
Chemical Industry : శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా లాబోరేటరీస్ లో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. పరిశ్రమ ఆవరణలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి.
కెమికల్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.