ఎండిపోయిన నిమ్మకాయను ఓ వ్యక్తి లక్షలు పోసి కొన్నాడు. యూకేలోని ప్రొప్పెర్లోని బ్రెట్టెల్స్ కంపెనీ వేసిన వేలంలో 285 ఏళ్లనాటి నిమ్మకాయను £1,416 (సుమారు రూ. 1,48,000)కు కొన్నారు. దీనిని తమ చివరి మేనమామ నుంచి వారసత్వంగా పొందిన ఓ కుటుంబం వేలానికి తీసుకొచ్చింది. నిమ్మకాయపై ‘మిస్టర్ పి లూ ఫ్రాంచినీ నవంబర్ 4 1739న మిస్ ఇ బాక్సిటర్కి అందించారు’ అని ఉంది. ఇన్ని సంవత్సరాలు ఓక నిమ్మకాయ ను దాచడం అంటే సాధారణ విషయం కాదు. ఓకటి కాదు రెండు కాదు ఏకంగా 285 సంత్సరాలు నిమ్మకాయను కాపాడుతూ వస్తున్నారు. తాతల కాలం నుంచి తరతరాలుగా ఈ నిమ్మకాయను ఆ కుటుంభం కాపాడుకుంటూ వస్తూఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడు కున్న ఈ నిమ్మకాయను వేలం వేశారు. ఇన్ని సంవత్సరాల నిమ్మకాయ లక్షా 48 వేలు పలికింది. ఈ నిమ్మకాయను ఓ వ్యక్తి సోంతం చేసుకున్నారు.