తెలంగాణ: శ్రీశైలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- శ్రీశైలం క్షేత్రానికి మధ్య పది ఏసీ బస్సులు నడిపించాలని సం స్థని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ రూట్ లో నాన్ ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. హైదరాబాద్- శ్రీశైలం మధ్య కొత్తగా 85 బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో 75 ఎక్స్ప్రెస్ బస్సులు 10 ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ప్రారంభిస్తారు.