Deliveries For Ayodhya Ram : అయోధ్య రాముడి కోసం ఆరోజే డెలివరీలు.. ఆస్పత్రులకు పోటెత్తుతున్న గర్భిణులు

Deliveries For Ayodhya Ram

Deliveries For Ayodhya Ram

Deliveries For Ayodhya Ram Mandhir Opening Ceremony : జనవరి 22 వ తారీఖున హిందువుల కలలకు ప్రతి రూపం శ్రీ రాముని ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ఉత్తర్ ప్రదేశ్  ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరిపించబోతుంది. దేశం నలుమూలల నుండి ఆరోజు భక్తులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కాబోతున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా , అందరికి శ్రీ రామ దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేసారు.

శ్రీరామునికి ప్రాణప్రతిష్ట జరగబోతున్న జనవరి 22 వ తారీఖుని ఎంతో దివ్యమైన రోజుగా భావిస్తున్నారు భక్తులు. ఆరోజు పుట్టబోయే బిడ్డలు శ్రీరాముడితో సమానం అని, తమకి ఆరోజు మాత్రమే డెలివరీ చెయ్యాలని గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ నుండి హాస్పిటల్స్ కి గర్భిణీ స్త్రీల నుండి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి అట. ఆరోజు జన్మించే మా బిడ్డలకు శ్రీరాముడి లక్షణాలు వస్తాయని గర్భిణీ స్త్రీల నమ్మకం.

నార్మల్ డెలివరీలతో పోలిస్తే సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన కేసుల్లో మాత్రం ఈ తేదీనే ఎక్కువగా తల్లిదండ్రులు రిఫర్ చేస్తున్నారన్నారు. పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్స్ లో సౌకర్యాలను వృద్ధి పరుస్తున్నామని హాస్పిటల్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే జనవరి 22 వ తారీఖున ప్రసవం జరిగితే, అందులో వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటో గర్భిణీ స్త్రీలకు ఎంతో వివరించే ప్రయత్నం చేశామని, కానీ వాళ్ళు మా మాట వినడం లేదని, జనవరి 22 వ తారీఖునే ప్రసవం జరగాలని పట్టుబట్టారు అని అంటున్నారు. ఇక ఆరోజు డెలివరీ చేయించుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయారు కాబట్టి గర్భిణీల ఆరోగ్యానికి కావాల్సిన జాగ్రత్తలు, సూచనలు మరియు సలహాలు అందిస్తున్నారట వైద్యులు.

ఇది ఇలా ఉండగా జనవరి 22 వ తారీఖున జరగబొయ్యే రామ్ లుల్లా ప్రాణప్రతిష్ట విగ్రహాన్ని ప్రస్తుతం ఎంతో రహస్యం గా ఉంచారు. గర్భగుడిలో ప్రాణప్రతిష్ట జరిగే వరకు దర్శనానికి అనుమతి లేదు. ఇకపోతే రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలూ విడుదల అయ్యాయి.ఎరుపు, బంగారు రంగులో ఉన్న కార్డులపై ఆలయ చిత్రం, పేరు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లోగో ఉన్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి  ప్రధాని మోడీ తో పాటుగా ముఖ్యమంత్రులు మరియు ఇతర పదోన్నత కలిగిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

— తోటకూర రఘు, ఆంధ్ర జ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు

TAGS