Ayodhya Ram Temple : అయోధ్య రామాలయంలోకి వెళ్లే భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఏంటో తెలుసా?

Ayodhya Ram Temple

Ayodhya Ram Temple

Ayodhya Ram Temple : అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అయోధ్య రాముడి గుడి నిర్మాణంపై దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పనుల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్షలు చేస్తోంది.

ప్రారంభోత్సవ గడువు దగ్గరకొస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెంచుతున్నారు. మూడు షిఫ్ట్ ల్లో పనులు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు 4 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించేందుకు రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఈ నెల 15 నుంచే రాములోరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

ఆలయంలో ప్రతిష్టించే విగ్రహాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి విగ్రహాల తయారుకు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రమిస్తున్నారు. ఆ బాధ్యతలను తీర్థ క్షేత్ర ట్రస్ట్ అతడికి అప్పగించింది. ఈ క్రమంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు డ్రెస్ కోడ్ పాటించాలని సూచిస్తున్నారు

పురుషులు ధోతీ, గంచా, కుర్తా, పైజామా ధరించాలి. మహిళలు చీర లేదా సల్వార్ సూట్/పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. జీన్స్, ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లాంటి పాశ్చాత్య దుస్తులు ధరించడం నిషేధం. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్ తో కూడిన కీ చైన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ల కూడదు.

TAGS