Rama Mandhir : రామాలయం.. జయభేరిని మోగించరా!

Ayodhya Rama Mandhir, Jai Sri Ram
- జయభేరి – రామాలయం
Ayodhya Rama Mandhir : విదేశీ మతోన్మాదంపై మన దేశ ప్రజ సాధించుకున్న విజయంగా రూపొందిన అయోధ్య రామాలయం ఇప్పుడు ప్రపంచానికి మన జయభేరి.
మహాస్వాప్నికుడు, తమిళ్ష్ మహాకవి సుబ్రమణియ బారతి ఒకప్పుడు తన స్వప్నానికి అక్షర రూపం ఇచ్చారు. నేను దానికి ఇలా తెలుగు రూపాన్ని ఇచ్చాను..
జయభేరిని మోగించరా! మోగించరా
జయభేరిని మోగించరా!
భయమనే దయ్యాన్ని తరిమేశాం - అసత్య
సర్పాన్ని చీల్చి దాని ప్రాణాన్ని తాగాం;
అకాశలోకాలన్నిటినీ అమృతమని ఆస్వాదించే
వేద జీవనాన్ని చేపట్టాం.
సూర్యుడి వెలుగులో స్నానం చేశాం – కాంతి
మధురామృతాన్ని చూస్తూ గడిపాం;
దొంగల్లే వచ్చి ప్రాణికులాన్ని ధ్వంసం చేసే
కాలుడు వణికిపొయేట్టుగా జాగృతమయాం.
కాకి పిచ్చుక మా జాతి – పొడవైన
కడలి, కొండ మా వర్గం
చూస్తున్న వైపంతా మనం తప్పితే ఎవరూ లేరు
చూస్తుంటే చూస్తుంటే సంతోష తాండవం
తెలుగులో
– రోచిష్మాన్
9444012279