New Jersey Car Rally : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం..న్యూజెర్సీలో భారీ కార్ల ర్యాలీ..

Ayodhya ram mandir inauguration celebrations in new jersey
New Jersey Car Rally : అయోధ్యలో రామమందిర నిర్మాణంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీనికి మద్దతుగా ఐఫీల్ టవర్ వద్ద రామ రథయాత్ర వైభవంగా జరగనుంది. అమెరికాలోని హిందువులు అక్కడ సంబరాలు చేస్తున్నారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా న్యూయార్క్ లోని ప్రఖ్యాత స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హిందూ కమ్యూనిటీతో కలిసి విశ్వహిందూ పరిషత్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రచారం చేస్తోంది.
టెక్సాస్, ఇల్లినాయీ, న్యూయార్క్, న్యూ జెర్సీ, జార్జియాతో పాటు పది రాష్ట్రాల్లో భారీ బోర్డులను ఏర్పాటు చేయడం విశేషం. అయోధ్యలో 22న జరిపే కార్యక్రమం విజయవంతం చేసేందుకు అక్కడి వారు పాటుపడుతున్నారు. ఈ మేరకు వీహెచ్ పీ అమెరికా శాఖ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్ పేర్కొన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
రాముడి విగ్రహ ప్రారంభానికి మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్, న్యూ జెర్సీలో 300 కార్లతో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. కార్లపై కాషాయ జెండాలు పెట్టుకుని ర్యాలీ చేపట్టారు. కార్ల ర్యాలీని అందరు ఆసక్తిగా చూశారు. పలు చోట్ల బిల్ బోర్డులు ఏర్పాటు చేసి అందరిని ఆకట్టుకున్నారు. మన రాముడికి అమెరికాలో కూడా మద్దతు తెలుపుతూ ర్యాలీ తీయడం విశేషం.