JAISW News Telugu

Ram Lalla : రామ్ లల్లా ప్రతిష్టాపనకు కఠిన నియమాలు ఆచరిస్తున్న ప్రధాని!!

Ram Lalla

Ram Lalla PM Modi

Ram Lalla : అయోధ్యలోని మహిమాన్వితమైన భవ్య, దివ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్టాపనకు రోజులు మరింత దగ్గర పడుతున్నాయి. ఇంకా నాలుగు రోజుల్లో జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ప్రపంచం యావత్తు ఉద్విగ్నంగా ఎదురు చూస్తోంది. ప్రపంచ నలుమూలలకు వేడుకలకు సంబంధించి లైవ్ టెలీకాస్ట్ జరుగుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలియజేసింది. ఇక రాముల వారి పరాణ ప్రతిష్టకు ముందు క్రతువులు జరుగుతున్నాయి.

అయోధ్య రామ మందిరంలో రాములోరి విగ్రహ ప్రతిష్టాపనకు 150 దేశాల నుంచి 4 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు అయోధ్య ఇప్పటికే సిద్ధమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున విగ్రహ ప్రతిష్టాపన సమయంలో పూజలో కూర్చునే 11 జంటలు నియమాలను పాటిస్తున్నాయి. నియమ నిష్ఠలతో వారు రామ దీక్ష చేపట్టారు.

ఇది ఇలా ఉంటే ప్రధాని మోడీ కూడా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక జపాన్ని పాటిస్తున్నారు. జనవరి 12వ తేదీ నుంచి ఆయన కఠిన నియమాలను ఆచరిస్తున్నారు. అనుష్టాన నియమాలు పాటిస్తూ ప్రధాని అయోధ్య ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సిద్ధమవుతున్నారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం శుభపరిణామమని, ఆ రోజు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట తన సమక్షంలో జరగడం, భారతీయుల ఆకాంక్ష నెరవేర్చేందుకే భగవంతుడు నన్ను పుట్టించినట్టు భావిస్తున్నానన్నారు.

ఈ ఘట్టం భావోద్వేగానికి గురి చేస్తోందని, జీవితంలో మొదటి సారి ఇటువంటి అనుభూతి పొందుతున్నానని అందుకే కఠినమైన అనుష్ఠాన నియమాలను అనుసరిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ప్రపంచం అంతటికీ పవిత్రమైన సందర్భం అని మోడీ అన్నారు.

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసి మరీ రామ మందిరానికి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయేలా రామాలయ ప్రారంభోత్సవ వేడుకను కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

Exit mobile version