PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల.. సాకారమైన వేళ
PM Modi : అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. కొద్ది గంటల్లో రాముడు కొలువుదీరనున్నాడు. కోట్లాది మంది కల రామాలయ నిర్మాణం. రామమందిర ప్రాణప్రతిష్టకు అశేష జనం తరలి వస్తున్నారు. అయోధ్యలో రాముడి కొలువు కల ఈనాటిది కాదు. దీని వెనుక ప్రధాని మోదీ 32 ఏళ్ల నాటి శపథం కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఆనాడే మోదీ అయోధ్యలో రాముడి విగ్రహప్రతిష్టాపనకే వస్తానని చెప్పి వెనుదిరిగారట.
రామాలయం కోసం పోరాటాలు జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పుతో చిక్కులు తొలగి నేడు ఆలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. దీనికి గాను దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలుతున్నారు. కోట్లాది మంది సాక్షిగా నేడు ఆవిష్కరణ జరగనుంది. అందరి కల నెరవేరనుంది.
ఆనాడు రామజన్మ భూమిలో మోదీ పర్యటన సందర్భంగా అక్కడ ప్రతిజ్ణ చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామమందిరం సందేశాన్ని దేశవ్యాప్తంగా వినిపించారు. ఆ సమయంలోనే అయోధ్య చేరుకున్నారు. మళ్లీ రాముడి విగ్రహ ప్రతిష్టాపనకే వస్తానని చెప్పడం విశేషం. రామజన్మ భూమి ప్రాంతంలో పర్యటన చేశారు.
జై శ్రీరామ్ నినాదాల మధ్య మోదీ ప్రతిజ్ణ చేశారు. రామమందిరం నిర్మించిన తరువాతే ఇక్కడకు వస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ కల సాకారమైంది. సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామాలయం కల నెరవేరింది. 2022 ఆగస్టు 5న భూమిపూజ చేశారు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు. అప్పుడు చేసి ప్రతిజ్ణ ఇప్పుడు తీరడం ఆ రాముడి మహిమగానే చెబుతున్నారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష చేశారు. అన్ని దారులు అయోధ్య వైపే సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శించారు. గుజరాత్, ఒడిశా, జమ్ముకాశ్మీర్ నుంచి దీపాలు, ధూపం, బత్తీలు అయోధ్యకు చేరుకున్నాయి. బాల రాముడి ప్రాణప్రతిష్ట యావత్ దేశాన్ని ఎంతో వైభవంగా మార్చనుంది.