JAISW News Telugu

Prabhas : మన రాజు గారు రాజుగారే..అయోధ్య అతిథుల భోజనం మొత్తం ఖర్చు  ప్రభాస్ దే!

Prabhas paid the entire cost of Ayodhya's guests meals

Prabhas to pay entire cost of Ayodhya’s guests meals

Prabhas : ప్రపంచంలోని కోట్లాది హిందువులు వేయికండ్లతో ఎదురుచూస్తున్న రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మరో నాలుగు రోజులే ఉంది. ఈనెల 22న ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో అనాడు రామయ్య పట్టాభిషేకం ఎలా జరిగిందో..మన యుగంలో ఆయన విగ్రహా ప్రాణప్రతిష్ఠ అదే స్థాయిలో జరిగేందుకు ప్రతీ హిందువు సహకారం అందిస్తున్నాడు. ఈ వేడుకలను ప్రపంచంలోని ప్రతీ హిందువు తిలకించేలా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా ఈ కార్యక్రమం చరిత్రలో పుటల్లో స్థానం సంపాదించుకోనుంది.

రామమందిర ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల వేలాది హిందూ భక్తులు తరలిరానున్నారు. వీరందరికీ భోజనం అందించే బృహత్తర బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు బహుబలి ప్రభాస్. ఆ భోజనాల కోసం అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు భోజన ఖర్చులు మొత్తం రూ.50 కోట్లను తాను అందిస్తానని ముందుకు వచ్చారు.

ఈ వేడుకకు తన వంతుగా సహకారం అందిస్తున్న ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే.  తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. గతంలో కృష్ణంరాజు ఇంటికి ఎవరూ వెళ్లిన పుష్టిగా భోజనం చేసే దాక వదిలేవారు కాదు. షడ్రుచులతో కూడిన భోజనాన్ని అతిథులు కడుపు నిండా తినేదాక ఆయన ఊరుకునే వారు కాదు అని సినీ జనాలు అంటుంటారు. ఆ వారసత్వాన్ని పెద్ద నాన్న నుంచి పుణికిపుచ్చుకున్న ప్రభాస్.. రామయ్య భక్తుల కోసం ఏకంగా రూ.50 కోట్ల ఖర్చుతో భోజనం ఏర్పాటు చేయిస్తుండడం చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. ఆదిపురుష్ లో రాముడి పాత్రను చేసిన ప్రభాస్.. నటుడిగానే కాదు మనిషిగా కూడా తాను రాజునేనని నిరూపించుకున్నారు.

వరుస సినిమాలతో తన ఇమేజ్ ను విస్తరించుకుంటు పోతున్న ప్రభాస్.. ఇప్పుడు తెలుగు నటుడు కాదు..ఆయన ఇమేజ్ టాలీవుడ్, బాలీవుడ్ కాదు..ఆయన ఇండియన్ స్టార్. దేశంలోనే ఏ హీరోకు లేని ఇమేజ్ ఆయన సొంతం. నటుడిగా తన కీర్తి ప్రపంచం నలుమూలాల విస్తరిస్తూ.. మనిషిగా సేవ, సహకారం వంటి విషయాల్లో మహోన్నత వ్యక్తిత్వం చూపించడం తెలుగు నేలకు గర్వకారణమే.

Exit mobile version