One Lakh TTD Laddu’s : దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో తిరుపతి ఒకటి. దేశవ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. దేవుడిని కొలుస్తుంటారు. వడ్డీకాసుల వాడిని ప్రసన్నం చేసుకునేందుకు మొగ్గుచూపుతుంటారు. దేశంలో ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా టీటీడీ ప్రసాదం పంపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈమేరకు పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో జనవరి 5న డయల్ యువర్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నారు.
ఈనెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పలువురు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంకల్పించారు. దీని కోసం రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పలు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయ విశిష్టత, ప్రతిష్ట ఇనుమడింపజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఆలయం గురించి అందరికి తెలియజేసేలా ముందుకు వెళ్తోంది.
అయోధ్య రామభక్తులకు పంచేందుకు లడ్డూలు పంపించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 25 గ్రాముల బరువు ఉన్న లక్ష శ్రీవారి లడ్డూలు అయోధ్యకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు డయల్ యువర్ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వర్ రావు, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లడ్డూల వితరణ కోసం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు టీటీడీ పంపించే లడ్డూల కోసం అయోధ్యలోని భక్తులు ఎదురు చూస్తున్నారు. శ్రీవారి లడ్డూలంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? ఇక్కడి లడ్డూలకు అంత డిమాండ్ ఉంటుంది. టీటీడీ అందించే లక్షలడ్డూలు భక్తులకు అందించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. తిరుపతి లడ్డూ అంటే అందరికి మక్కువ ఎక్కువే. శ్రీవారి లడ్డూలు అయోధ్య వాసులను అలరించనున్నాయని పేర్కొంటున్నారు.