Chiranjeevi-Ambani : అయోధ్య లో అంబానీ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి..ఇది రేంజ్ అంటే!

Megastar Chiranjeevi who met Anil Ambani in Ayodhya
Chiranjeevi-Ambani : దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు దేశం లోని అన్నీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు శ్రీ రాముడి వైభోగాన్ని కళ్లారా వీక్షించి పులకరించిపోయారు. మన టాలీవుడ్ నుండి కేవలం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు.
తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. అనిల్ అంబానీ, ముఖేష్ కూతురు మరియు అల్లుడు తదితరులు హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వచ్చిన విశిష్ట అతిథులను ప్రత్యేకంగా పలకరించాడు. āనంతరం ఆలయాన్ని నిర్మించిన కార్మికులపై స్వయంగా తన చేతులతో పూల వర్షం కురిపించాడు.
ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ అంబానీ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చిరంజీవి ని చూసి స్వయంగా అనిల్ అంబానీ ఆయన దగ్గరకి వచ్చి ప్రత్యేకంగా ముచ్చటించారు. మెగాస్టార్ బాగోగులు అడిగి తెలుసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళాడు. చిరంజీవి తో పాటుగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పక్కనే ఉన్నాడు. ఇది చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఇదా అని ఆశ్చర్యపోతున్నారు. మన పుట్టకముందే ఆయన పాన్ ఇండియన్ సూపర్ స్టార్, బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించాడు. అసలు పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మొదలైంది మెగాస్టార్ చిరంజీవి నుండి అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా కోరుకున్నారు. కానీ అది జరగలేదు. అంతా ఒక్కటే చోట ఉన్నప్పటికీ ఎందుకు కలవలేదు. వీళ్ళ మధ్య మళ్ళీ దూరం ఏమైనా పెరిగిందా అని అభిమానులు అనుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన సంక్రాంతి సంబరాల్లో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన మెగా ఫ్యామిలీ తో కలిసి కనపడి ఏడాది దాటింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.