Modi : రాముడి విగ్రహాన్ని మోదీ ఎలా ప్రతిష్ఠిస్తారు? శాస్త్రం ఏం చెప్తోంది..

How will Modi dedicate the statue of Ram

How will Modi dedicate the statue of Ram

Modi : కోట్లాది మంది హిందువుల శతాబ్దాల నాటి కల నెరవేరింది.  నిన్న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది. 12 గంటల ప్రాంతంలో ఆలయం లోపలికి వచ్చిన ప్రధాని మోదీ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మోదీ.. అనంతరం పూజకార్యక్రమాల్లో పాల్గొని బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో కోట్లాది భక్తులు ‘జైశ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. భక్తపారవశ్యంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా రాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎలా చేస్తారని కూడా విమర్శలు వచ్చాయి. విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజారులు చేయాలని మోదీతో ఎందుకు చేయించారని అంటున్నారు. అయితే దీనికి పలువురు తగిన కారణాలతో సమాధానం చెబుతున్నారు.

విగ్రహాల ప్రతిష్ఠాపనలో పలు రకాలు ఉంటాయని వారు చెబుతున్నారు.  ఒక ఊరిలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠాపన చేద్దామనుకున్న గ్రామస్తులు ఒక పెద్దాయనను కలిశారట. ఆయన ప్రతిష్ఠ గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..  ప్రతిష్ఠాపనలో ఊరిలో ప్రతీ ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్లి శివాలయం ఒక చెంబు నీళ్లతో అభిషేకం చేయించవచ్చు. అందులో అందరికీ అవకాశం కల్పించినట్టు అవుతుంది. శాస్త్రంలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి  చాలా రకాలు ఉంటాయి. అందులో వాయు ప్రతిష్ఠ ఒకటి. ఇలా ప్రతిష్ఠించిన విగ్రహాలను, శివలింగాలను ఎవరైనా తాకవచ్చు. పూజలు చేయవచ్చు. అలాగే ఉత్తరాది ప్రాంతంలో ఎవరైనా నేరుగా గుడిలోకి వెళ్లి స్పర్శ దర్శనం చేసుకునే వీలుంది. అలాగే శ్రీశైలం, కీసర వంటి పుణ్యక్షేత్రాల్లోనూ గర్భగుడి శివలింగంతో పాటు బయట ఎన్నో శివలింగాలు ఉంటాయని.. అందులో గర్భగుడి శివాలయం తప్ప అన్ని శివలింగాల వద్ద అందరూ పూజలు చేయవచ్చని చెప్పారు.

కాగా, రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శాస్త్రం చెప్పినట్టుగానే జరిగిందని, మోదీ ఆవిష్కరించడంలో తప్పేమి లేదని పండితులు చెబుతున్నారు. వేదపండితులు మంత్రాల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య ఇలాంటి క్రతువులను కీలక వ్యక్తులు చేతుల మీదుగా నిర్వహించడం సహజమేనని అంటున్నారు.

TAGS