Ram Lalla : ఇప్పుడు ఎవరి నోట విన్నా రామ్ లల్లా నామం మారుమోగుతోంది. అయోధ్యలో ప్రతిష్టించే రాముడిని కూడా రామ్ లల్లా అని పిలుస్తారని తెలుస్తోంది. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో రాముడిని రామ్ లల్లాగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అయోధ్య రాముడిని రామ్ లల్లా అని సంబోధిస్తున్నారు. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ లల్లా పేరు అందరి నోట ప్రధానంగా వినిపిస్తోంది.
రాముడి విగ్రహాలు తయారు చేసే పనిని వేరువేరు కళాకారులకు అప్పగించారు. అందులో కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే కళాకారుడు చేసిన విగ్రహం ఎంపికైంది. దాన్ని మందిరంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని రామ్ లల్లా అని పిలుస్తున్నారు. రాముడిని చిన్నప్పుడు రామ్ లల్లా అని పిలిచేవారట. అందుకే ఇప్పుడు రాముడిని రామ్ లల్లా అని పిలిచేందుకు దేశం మొత్తం సిద్ధం కావడం గమనార్హం.
బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ నెల 22న ప్రారంభించబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్టను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.
రాముడి విగ్రహ ప్రతిష్టకు ప్రముఖులు రానున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు వస్తున్నారని చెబుతున్నారు. ప్రధాని చేతుల మీదుగా జరిగే వేడుకను దిగ్విజయం చేసే దిశగా ఆలోచిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో రాముడి విగ్రహ ప్రతిష్ట చరిత్ర లిఖిస్తుందని అంటున్నారు.