Modernization of Ayodhya : అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణలకు సిద్ధం అవుతోంది. 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు లక్షలాది మంది ఈ ఘట్టం తిలకించేందుకు రెడీ అవుతున్నారు. రామాలయం భక్తులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా కనకవర్షం కురిపించనుంది. మన ఆర్థిక వ్యవస్థకు సహాయంగా నిలవనుంది.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ ను ప్రధాని ప్రారంభించారు. అదే రోజు రూ.15 వేల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రామాలయ సముదాయంతో పాటు పలు పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అయోధ్యలో పలు మార్పులు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేందుకు సిద్ధమయ్యారు.
రామజన్మ భూమి కోసం పదేళ్లలో రూ. వేలాది కోట్లు రానున్నాయి. 2031 వరకు ఇక్కడ ప్రతి రోజు లక్షలాది మంది భక్తులను రప్పించబోతోంది. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లతో డెవలప్ మెంట్ చేయనుందని చెబుతున్నారు. ఇలా అయోధ్య ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి.
అయోధ్యలో రూ. 31,662 కోట్ల బడ్జెట్ తో రూపురేఖలు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్ హెచ్ఏఐ రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొస్తోంది. యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం రూ. 7500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులు చేపడుతోంది. విమానాశ్రయం, రైల్వేలు, హైవేలు ఆధునీకరించనున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముందుకు వెళ్లనున్నాయి.
జనవరి 22న జరిగే ప్రతిష్టాపనకు ముందు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్ లు బీలైన్ తయారు చేస్తున్నాయి. పర్యాటకాన్ని లెక్కలోకి తీసుకుని జనాభాలో 8-10 రెట్లు పెరగబోతోంది. తాజ్, రాడిసన్, ఐటీసీ హోటల్స్ పలు 5 స్టార్ బ్రాండ్లను తెరవనున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కొత్త మలుపులు తిరగనుంది. అయోధ్య గతినే మార్చనుందని సమాచారం.