Hotel Prices in Ayodhya : అయోధ్యలో హోటల్ ధరలకు రెక్కలు.. ప్రస్తుతం ఎంత పెరిగాయో తెలుసా?
Hotel Prices in Ayodhya : అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకకు దేశ విదేశాల్లోని చాలా మంది రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి హోటళ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఇన్నాళ్లు మామూలుగా ఉన్న ధరలు ప్రస్తుతం రూ.10 వేల పైనే ఉండటంతో అక్కడ బస చేయడం కష్టంగానే మారింది. దాదాపు 4 వేల మంది అతిథులకు ఆహ్వానాలు పంపారు. దీంతో వారి రాక అక్కడ సందడి కానుంది.
హోటల్ అయోధ్య ప్యాలెస్ లో రోజువారి అద్దె రూ. 18,500 అని సమాచారం. మామూలు రోజుల్లో రూ.3,700 ఉండే ధర ప్రస్తుతం ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ది రామయణ హోటల్ అద్దె రూ.40,000లకు చేరింది. 2003లో రూ.14,900 ఉన్న అద్దె ఇప్పుడు భారీగా పెరిగింది. సిగ్మెట్ కలెక్షన్ హోటల్ లో ఒక రోజు అద్దె రూ.70,000గా ఉంది. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,500 ఉండేది. ఇందులో గదుల బుకింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తయిందని సమాచారం.
ఈ నెల 20 నుంచి 23 వరకు అన్ని హోటళ్లు దాదాపు పూర్తయ్యాయి. ఒక రోజు అద్దె రూ.10,000 ల నుంచి 25,000లకు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. విలాసవంతమైన గదులకు రోజుకు రూ. లక్ష కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రూ.7,500 ఉండేది. రాబోయే రోజుల్లో అద్దెలు మరింత పెరిగే వీలుంది.
అయోధ్యలో జనవరి 22న జనం కిక్కిరిసి పోనుంది. దేశవ్యాప్తంగా చాలా మంది రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. లక్షల్లో జనం వస్తే కంట్రోల్ చేయడం కష్టమే. ఈనేపథ్యంలో రాముడి ప్రాణప్రతిష్టను చూడాలని అందరు ఉవ్విళ్లూరుతున్నారు. అయోధ్య మొత్తం జనమయం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని నియంత్రణలో ఉంచడం ఇబ్బందికరమే అని చెబుతున్నారు.