Ram Mandir Night View : అయోధ్య రామ మందిరం రాత్రిపూట ఎలా ఉంటుందో మీకు తెలుసా..

Ram Mandir Night View pics viral
Ram Mandir Night View : అయోధ్య రామ మందిరం కోసం యావత్ భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఈ అద్భుత కట్టడాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణం ఎలా కనిపించనుందో తెలిపేందుకు కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ నెల 22న ఆలయ ప్రారంభోత్సవం జరుగు తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయంలో బంగారo తో పూత పూజించిన పలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. రామ మందిరం ఎప్పుడె ప్పుడు దర్శించుకోవాలని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 22వ తారీఖన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈ రామ మందిరం పట్టాహాసంగా ప్రారంభం కాబోతుంది.