Lord SriRam : ప్రాణప్రతిష్ట తరువాత రాముడి హావభావాలు మారాయట?
Lord SriRama : అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాన జరిగింది. రాముడి చిరునవ్వు చూస్తుంటే నిజంగానే నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. చూసే భక్తులకు కనువిందు చేస్తోంది. విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన యోగిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ లల్లా విగ్రహం సహజత్వానికి భిన్నంగా మారిందని చెబుతున్నారు. దీంతో తాను తయారు చేసిన విగ్రహం ప్రాణప్రతిష్ట తరువాత మారిందని అంటున్నారు.
అసలు నేను తయారు చేసిన శిల్పం చాలా మారిపోయింది. నేను తయారు చేసిన విగ్రహమేనా అనిపిస్తుంది. పది రోజులుగా రామ్ లల్లా విగ్రహంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో భావాలు మారాయి. రామ్ లల్లా విగ్రహం ఇలా మారడంపై ఆశ్చర్యం వేసిందని తన మనసులోని మాటను వివరించారు.
బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడ, వ్యాపార ప్రముఖులు దీనికి విచ్చేసి తమ భక్తిని చాటుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు తారలు హాజరై రాముడి ఆశీస్సులు పొందారు. రాముడికి అత్యధిక విరాళం ఇచ్చిన వారిలో పవన్ కల్యాణ్ ముందున్నారు. ఆయన రూ.30 లక్షలు విరాళంగా అందజేయడం విశేషం.
అయోధ్యలో భక్తుల తాకిడి పెరిగింది. రోజుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రాత్రి చలిలో కూడా క్యూలో నిలబడి రాముడిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమలలో కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తజన సందోహం మరింత పెరిగే సూచలున్నాయని చెబుతున్నారు.