Ram Mandir Story : బాబ్రీ మసీదు, అయోధ్య రామాలయం..అసలు సిసలు వాస్తవాలివి..

Ayodhya Ram Mandir Original Story

Ayodhya Ram Mandir Original Story

Ram Mandir Story : 1526 సంవత్సరమది. మొఘల్ వంశ స్థాపకుడు బాబర్, ఇబ్రహీంలోడి మధ్య పానిపట్టు వద్ద యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో విజయం ద్వారా మొఘలుల పరిపాలన భారత దేశంలో ప్రారంభమైంది. 1528వ సంవత్సరం వచ్చే నాటికి భారత్ లోని ఎన్నో ప్రాంతాలను గెలుచుకున్న బాబర్..అయోధ్య మీద కూడా పూర్తిగా తన పట్టు సాధించాడు. 1528వ సంవత్సరంలో అప్పటికీ అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాఖీకి ఆదేశాలిచ్చాడు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాఖీ. వాటిలో అయోధ్య రామాలయం కూడా ఒకటి. అయితే అయోధ్య రామమందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీదు అయ్యింది. బాబర్ తర్వాత చాలాకాలం పాలించాడు. మసీదుగా మారిన తర్వాత అయోధ్య రామాలయంలోకి ఒక్కరూ కూడా అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే రాజా జైసింగ్ వచ్చాడో.. అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది.

అది 1717వ సంవత్సరం. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజ్ పుత్ వంశానికి చెందిన రాజా జై సింగ్ మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన జైసింగ్.. మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అయినా అనుకున్నది జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్రా అనే పేరు మీద వేదిక కట్టి దాని సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునే వారు.

ఆ తర్వాత కాలం జరిగిన సంఘటనలు..

-1885 లో రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామాలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్ దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు.

-1949 లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు.

-1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపథ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు.

-1950లోనే పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాలంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామమందిర ఉద్యమానికి పురుడు పోసింది.

-1959 లో వివాదస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది.

-1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది.

-1986 ఫిబ్రవరి 1న హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతధ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.

-1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైంది. దీంతో రామమందిర ఉద్యమం మరింత ఊపందుకుంది.

-2002 ఈ వ్యవహరం అలహాబాద్ హైకోర్టుకు చేరింది.  వివాదస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది.

– 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించింది. వివాదస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

-2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది.

-2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీం విచారణ ప్రారంభించింది.

-2019ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంలో రోజువారీ విచారణ ప్రారంభం. నవంబర్ 9న సుప్రీంకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామజన్మభూమికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్థాలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణానికి అడుగులు పడి.. 22న ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

కాగా, బాబ్రీ మసీదు, రామాలయ పూర్తి చరిత్రలు ఇవి. దేశంలోని మెజార్టీ ప్రజలైన హిందువుల ఆరాధ్య దైవం రాముడి ఆలయం అక్కడ రేపు ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో ముస్లింలు ఇదేదో తమ ఓటమిగా భావించకుండా..సోదరులుగా హిందువులను అభినందించాలి. భారత్ అంటే అన్ని మతాలు వర్ధిల్లే ప్రాంతం. అందరూ కలిసి ఉండాలి. దేశం కోసం పనిచేయాలి. ప్రపంచంలోనే దేశం అగ్రపథాన నిలబడాలి.

TAGS