Ram Mandir : అయోధ్యలో అద్భుతమైన కట్టడం రామాలయం. శ్రీరాముడి జన్మస్థానంగా చెబుతున్న ప్రాంతం కావడంతో రాముడికి ఆలయం నిర్మిస్తున్నారు. అత్యంత సుందరంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సుందరమైన ఆలయాన్ని ఈనెల 22న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సంకల్పించారు.
రాముడి విగ్రహం పొడవు 1.5 టన్నుల బరువు, పొడవు 51 ఇంచులతో దర్శనం ఇవ్వనున్నాడు. 22న 12.30 గంటలకు ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రానున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు రాముడి విగ్రహంపై పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుతాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయోధ్య గర్భాలయంలోని రామయ్య విగ్రహం ఎత్తు విషయంలో అంతరిక్ష పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నారు. తెలుగు నెలల ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షంలో తొమ్మిదో రోజు శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజు సూర్యుడి కిరణాలు రాముడి విగ్రహంపై పడేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడు రాముడి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెబుతున్నారు.
గర్భగుడిలో ప్రతిష్టించే రాముడి విగ్రహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలోనే నిపుణులైన శిల్పులను పిలిపించి వారిలో ముగ్గురికి రామయ్య విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతలు అప్పగించారు. వారిలో ఒకరి విగ్రహాన్ని తీర్చిదిద్దే అవకాశం కల్పించారు. దీన్ని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.