Chandrababu to go to Ayodhya : అయోధ్యలో రాముడి విగ్రహావిష్కరణకు దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లకు రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు పంపించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఈనెల 21నే అయోధ్య బయలుదేరి వెళ్లనున్నారు. 22న మధ్యాహ్నం 12.20 గంటలకు జరగబోయే రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా 8 వేల మందికి ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. రాముడి ప్రాణప్రతిష్టకు వీరంతా రానున్నారు. ప్రముఖులంతా రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాముడిని చూసేందుకు పలువురు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలను దీనికి రావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలకు ఆహ్వానాలు అందలేదు. జగన్ అన్యమతస్తుడైనందునే ఆయనను పిలవలేదు. ఇక రేవంత్ రెడ్డి ని పిలవకపోవడానికి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. అందుకే రేవంత్ కు ఆహ్వానం అందలేదు. ఇలా ఇద్దరికి ఆహ్వానాలు రాలేదని చెబుతున్నారు.
అయోధ్యలో జరిగే రాముడి ప్రతిష్టాపన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం వేడుకగా జరగనుంది. దీనికి గాను ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రామ జన్మ భూమిలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించే పనిలో దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చి అట్టహాసంగా చేపట్టనున్నారు.