Ayodhya Rama on Saree : చీరపై అయోధ్య, రాముడి చిత్రాల ముద్రణ.. ఫలించిన వారి నిరీక్షణ
Ayodhya Rama on Saree : అయోధ్య రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలంతా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 22న ప్రారంభించబోయే ఆలయం విశిష్టతను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. రామభక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వేడుకలను కళ్లారా చూడాలని తహతహలాడుతున్నారు. ఈనేపథ్యంలో రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సమయం దగ్గర పడుతుండటంతో కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు.
గుజరాత్ సూరత్ లోని వస్త్ర వ్యాపారాలు వినూత్న భక్తిని చేపట్టారు. సంబరాలు అంబరాన్నంటేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భక్తిని చాటుకునేందుకు ముందుకు వచ్చారు. చీరపై రాముడి విగ్రహంతో పాటు రామాలయం చిత్రాలను ముద్రిస్తున్నారు. దీనికి ముందు చాలా సార్లు ప్రాక్టీసు చేసి చివరకు విజయం సాధించారు. ఇప్పుడు అయోధ్యకు వాటిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వీటిని వాడేందుకు పంపుతున్నారు. సూరత్ లోని అన్ని రామాలయాలకు వీటిని పంపించారు. ఇలా రాముడి చిత్రం, రామాలయం చిత్రాలు ముద్రించి ఉన్న చీరలను పంపించడంతో వారి భక్తిని చాటుతున్నారు. దేశవ్యాప్తంగా చీరలు పంచుతుండటం విశేషం. వారి భక్తి భావాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.
దైవచింతనతో చీరలపై చిత్రాలు వేస్తూ నేయడం ఓ నైపుణ్యత. దీనికి చాలా శ్రమించాలి. కానీ వారు మాత్రం కొన్ని సార్లు ఫెయిల్ అయినా చివరకు సక్సెస్ అయ్యారు. దేవుడి, ఆలయ పటాలు చిత్రించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని అయోధ్యలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా వారి ప్రతిభా సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు అయోధ్యను వారు ఆసరాగా ఎంచుకున్నారు.