Ram Janmabhoomi : రామజన్మభూమి నిర్మాణాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి ఆహ్వానం

Ram Janmabhoomi

Ram Janmabhoomi

Ram Janmabhoomi : అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ట చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆహ్వానాలు కూడా అందాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి మాత్రం ఒకరు ఉన్నారు. ఆయనే ఇక్బాల్ అన్సారీ. బాబ్రీ మసీదు మాజీ పార్టీ హషీం కుమారుడు ఇక్బాల్ అన్సారీకి రాముడి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం అందజేశారు. దీంతో ఆయన రావడానికి సుముఖత వ్యక్తం చేశారు.

ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు రాంలాలా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశ వ్యాప్తంగా అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగానే అన్సారీకి కూడా గౌరవంగా ఆహ్వానం అందించడం కలిగించింది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్సందిస్తోంది. 1949 నుంచి అన్సారీ హిందువులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

వివాదాస్పద స్థలం కోసం ప్రధాన పోటీదారులతో నిర్మోహి అఖారాకు చెందిన రామ్ కేవల్ దాస్, దిగంబర్ అఖారాకు చెందిన రామచంద్ర పరమహంస్ తో కూడా మంచి సంబంధాలు కొనసాగించారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఇక్బాల్ అన్సారీ మసీదు గురించి వాదనలు వినిపించారు. రామమందిరాన్ని వ్యతిరేకించిన కుటుంబ పెద్దను ఈ రోజు రామమందిరం ట్రస్ట్ లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించడం గమనార్హం.

అయోధ్య మతపరమైన నగరమని పలుమార్లు అన్సారీ వ్యాఖ్యానించారు. అన్ని మతాల వారికి అనుకూలంగా ఉంది. రామజన్మ భూమిలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో ఆయన స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

TAGS