Telangana : తెలంగాణ నుంచి అయోధ్యకు 3 లక్షల మంది భక్తులు
Telangana : అయోధ్యలో రాముడి విగ్రహ ఏర్పాటు ఈనెల 22న నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిపేందుకు రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అధిక మందిని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాములోరి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసింది.
మన తెలంగాణ నుంచి 3 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అరవై రోజుల పాటు రోజుకు ఐదు వేల మంది భక్తులను పంపిస్తోంది. ఈనేపథ్యంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుక ప్రత్యక్షంగా తిలకించేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ బాధ్యతను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అప్పగించింది. ఆయన ఆధ్వర్యంలో భక్తులను తరలించడానికి ఏర్పాట్లు చేసింది.
రైల్వే శాఖ సహకారంతో ప్రయాణం, వసతి, భోజనం, దర్శనీయ ప్రదేశాలు అన్ని కార్యక్రమాలు నిర్వహణకు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారిని ఎంచుకుని పంపిస్తున్నారు. వారు అక్కడ రాముడి దర్శనం చేసుకునేందుకు తగిన వసతులు కల్పిస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు పలువురిని గుర్తిస్తోంది. వారిని ప్రత్యేక రైళ్లలో పంపించే ఏర్పాట్లు చేస్తోంది.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించే భాగ్యం అందిపుచ్చుకునే అవకాశం ఇస్తోంది. దీని కోసం అక్కడకు వెళ్లే వారి జాబితాను ఇప్పటికే తయారు చేసింది. ప్రత్యేక రైళ్లలో వారిని అయోధ్యకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేసింది. వారి దర్శనం ప్రత్యక్షంగా జరిగేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పిస్తోంది. దీంతో రాముడిని స్వయంగా చూసే అవకాశం కోసం భక్తులు కూడా బారులు తీరుతున్నారు. తమ దైవాన్ని దర్శించే అవకాశం అందిపుచ్చుకుంటున్నారు.
-తోటకూర రఘు
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు