Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ పెళ్లిపై మరో సారి రచ్చ.. ఈసారి అమ్మాయి ఆమే?
Anchor Pradeep : యాంకర్ అంటే అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు. వాక్చాతుర్యంతో పాటు అందం కూడా ఉంటుంది కాబట్టి రాణిస్తుంటారు. ఈ పోటీ ప్రపంచంలో మేల్ యాంకర్ రాణించాలంటే చాలా అరుదు.. కానీ వీటన్నింటినీ తట్టుకొని రాణిస్తున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తనదైన స్టయిల్ యాంకరింగ్ తో ఎక్కువ కాలం బుల్లితెరపై, అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తున్నాడు. అతడి పర్సనల్ లైఫ్గురించి.. అందులో ముఖ్యంగా అతడి మ్యారేజ్ గురించి అప్పుడప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో ఒకసారి జరగగా రీసంట్ గా మరోసారి జరిగింది.
కెరీర్ లో మరింత ఎత్తుకు..
కెరీర్ మొదట్లోనే బెస్ట్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ చాలా వరకు షోలు, ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పటికీ వరుస షోలను చేస్తూనే ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. అదిరిపోయే వాక్చాతుర్యం, మంచి పంచులతో కెరీర్మరింత ఎత్తుకు ఎదుగుతున్నాడు. లుక్స్ పరంగా మెస్మరైజ్ చేసేస్తున్నాడు. అలా తన ప్రతిభ అండ్ లుక్స్‌తో మంచి ఆఫర్లను దక్కించుకుంటున్నాడు.
ప్రదీప్ చాలా కాలం క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఒక సినిమాలో లీడ్ రోల్ లో కనిపించాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’లో హీరోగా కూడా చేశాడు. ఇది బాక్సాఫీస్ వద్ద పర్వేలేదనిపించింది. దీని తర్వాత మళ్లీ సినిమా చేయలేదు.
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్అనగా ముద్ర వేసుకున్నాడు ప్రదీప్. ఆయన పెళ్లిపై అనేక వార్తలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. వీటితో మాచిరాజు ఎప్పటికప్పుడు బుల్లి తెరపై ట్రెండింగ్ టాపిక్ గా మారిపోతుంటాడు. ఇందులో భాగంగానే మరోసారి అతడి పెళ్లిపై రచ్చ మొదలైంది.
నటి మంచు లక్ష్మీ ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే ఈవెంట్నిర్వహించింది. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు సందడి చేశారు. ఇందులో ప్రదీప్ కూడా పాల్గొన్నాడు. మెరూన్ కలర్ ఔట్ ఫిట్‌లో టాప్ టు బాటమ్ స్టయిలిష్ లుక్‌లో టిప్ టాప్ గా కనిపించాడు.
తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘రెడీ ఫర్ టీచ్ ఫర్ చేంజ్’ అంటూ క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ‘సరే కానీ పెళ్లి తేదీ ఎప్పుడు’, ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్బ్రదర్’ అంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ‘హ్యాపీ మ్యారేజ్ లైఫ్’ అన్నా అంటూ పెళ్లి కూడా చేసేస్తున్నారు. ఈ సారి ఆయన అదృష్టం ఏంటంటే ఏ అమ్మాయి పేరు నెటిజన్లు ఉపయోగించలేదు.