Pawan Full Clarity : పవన్ పోటీ చేసేది అక్కడ్నుంచే..! ఫుల్ క్లారిటీ వచ్చేసింది..

Pawan Full Clarity

Pawan Full Clarity

Pawan Full Clarity : జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా ‘ప్రజాప్రతినిధి’ ముచ్చట మాత్రం తీరలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, 2019 ఎన్నికల్లో పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోవడం పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్ తో పాటు ఇతరులను సైతం షాక్ కు గురిచేసింది. మా పవన్ ఓడిపోవడమేంటి? అని ఫ్యాన్స్ ఎంతగానో ఆవేదన చెందారు. పవన్ కూడా ఈ ఘోర పరాభావాన్ని అప్పుడప్పుడు తలుస్తూనే ఉంటారు. జనసేన సభల్లో యువత ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూనే..‘‘ మీరు సభలకు వచ్చి హంగామా చేస్తారు.. కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఓట్లు వేయరు..ఇకనైనా మారాలి జనసైనికుల ప్రతీ ఓటు జనసేనకే పడాలి..ఇతరులతోనూ ఓటు వేయించాలి..’’ అంటూ ప్రతీ సభలోనూ చెబుతుంటారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం ఈ వారంలో తేలుతుందని అంటున్నారు. ఈక్రమంలో జనసేనాని పోటీ చేసే నియోజకవర్గాలపై ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. వివిధ రకాలు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రస్తుతం క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. గత కొద్దిరోజులుగా గాజువాక, తిరుపతి, భీమవరం స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇవాళ పవన్ భీమవరం పర్యటనలో ఉన్నారు. ఇక్కడి నుంచి బరిలో ఉండబోతున్నట్టు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు టీడీపీ, జనసేన పార్టీల నేతలకు ఆయన క్లారిటీ ఇచ్చారట. స్థానిక టీడీపీ నేతలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా, నేటి మధ్యాహ్నం పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహరంపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.

TAGS