Rashmika Deep Fake Video : రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు ..
Rashmika Deep Fake Video : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక సమస్యను ఫేస్ చేసిన విషయం తెలిసిందే.. ఈ భామ డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట సెన్సేషన్ అయ్యింది. రష్మిక మందన్న వీడియోపై యావత్ ఇండియా స్పందించారు.. బిగ్ బి వంటి వారు కూడా స్పందించి ఈ సమస్యను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐసీసీ) లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ), 469 (పరువుకు హాని కేజలిగించడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000 లోని సెక్షన్లు 66C (గుర్తింపు దొంగతనం), 66E ( గోప్యత ఉల్లంఘన) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. చూస్తుంటే పోలీసులు కాస్త సీరియస్ గానే ఈ కేసును తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది.. డీప్ ఫేక్ అనేది ఏఐ ఆధారితంగా వీడియో, ఫోటోలను సృష్టించే డిజిటల్ టెక్నాలజీ అనే విషయం తెలిసిందే.. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
నవంబర్ 6న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను గురించి స్పందించింది.. దీన్ని షేర్ చేస్తూ ఇలాంటి వీడియోను షేర్ చేయడం బాధగా ఉందని ఈ టెక్నాలజీని వినియోగించుకుని ప్రతీ ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంది.. ఈమె ఫ్యాన్స్ కూడా ఏఐ టెక్నాలజీను పూర్తిగా మిస్ యూజ్ చేస్తున్నారు అంటూ మండి పడుతున్నారు.