Mysterious Places : భారత్ లో మిస్టరీ ప్రదేశాలు..సైన్స్ కు చిక్కని రహస్యాలు..

Mysterious Places

Mysterious Places

Mysterious Places : భారత్ విభిన్న సంస్కృతులకు నెలవు. వివిధ భాషలు, వివిధ ఆచారాలు, వివిధ మతాలు, వివిధ సంప్రదాయాలు..ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి. అలాగే సైన్స్ కు అందని రహస్యాలు భారత్ లో ఉన్నాయి. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం మనకు సొంతం. లక్షల ఆలయాలు, కట్టడాలు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కాంక్రిట్ నిర్మాణాలను చూసి మురిసే నేటి జనం..వేల ఏండ్ల కిందట ఏ టెక్నాలజీ లేకుండానే అద్భుత నిర్మాణాలు చేపట్టి ఔరా అనిపించారు. ఇవి అందమైనవే కావు ఎన్నో రహస్యాలను వాటిలో నిక్షిప్తం చేసుకున్నాయి. అందులో కొన్నింటికీ ఇప్పటికీ ఏ సైన్స్ సమాధానం చెప్పలేదు. అందులో కొన్ని..

అజంతా- ఎల్లోరా గుహలు:
మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ గుహల చరిత్ర 4 వేల సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. అజంతాలో 30 గుహలు, ఎల్లోరాలో 12 గుహలు ఉన్నాయి. ఈ శిల కింద ఒక నగరం కూడా ఉందని చెబుతారు. ఈ గుహలు పర్వతాన్ని తొలిచి నిర్మించారని చెబుతున్నారు.

భాంగర్ కోట:
రాజస్థాన్ లోని భాంగర్ కోట ఎంతో పేరుగాంచింది. ఈ కోట జైపూర్ నుంచి 32 మైళ్ల దూరంలో ఉంది. ఈ కోట చరిత్ర దెయ్యాలు, దెయ్యాల కథలతో ముడిపడి ఉందని చెబుతారు. ఈ కోట 17వ శతాబ్దం నాటిదని చరిత్ర చెబుతోంది. నేటికీ ఇక్కడ దెయ్యాలు, పిశాచాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.

రూప్ కుండ్ సరస్సు:
ఈ సరస్సు ఉత్తరాఖండ్ లోని సరస్సుల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది. భూమి నుంచి  ఈ సరస్సు 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ అనేక మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయని చెబుతారు. ఈ అస్థి పంజరాలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయం చెప్పలేం అంటున్నారు.

లేపాక్షి దేవాలయం:
దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన ఏపీలో లేపాక్షి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో 70 స్థంభాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఒక స్థంభం పైకప్పు సహాయంతో గాలిలో వేలాడుతూ ఉంటుందని చెబుతారు. ఇప్పటివరకు ఆ రహస్యం ఎవరూ బయటపెట్టలేకపోయారు.

TAGS