Amrit Bharat Trains : దేశంలో త్వరలో మరో 50 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్…
Amrit Bharat Express Trains : దేశంలో త్వరలో మరో 50 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ పట్టాలెక్కున్నాయి. ఈ అమృత్ భారత్ మొదటి రైలును అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల్లో విశేష స్పందన లభిస్తోంది.
దీంతో త్వరలోనే మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే ది శగా కేంద్రం అడుగులు వేస్తోస్తున్నట్లు తెలుస్తోం ది. ఇందులో భాగంగానే అమృత్ భారత్ 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి ఆయన తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమృత్ భారత్ రైలు భారీ విజయం సాధించడంతో మరో 50 అ మృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించింది’ అని ఆయన వివరించారు.
భారత్‌లో తొలిసారిగా రెండు అమృత్ భారత్ ట్రైన్లను గతసంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభిం చారు. అందులో ఒకటి ఉత్తరాది, ఒకటి దక్షిణా దిలో ప్రయాణిస్తోంది. గతేడాది డిసెంబర్ 30న తొలిరైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారం భించారు. ఈ రైళ్లు పూర్తిగా నాన్ ఏసీ బోగీలతో నడుస్తాయి. అంతేకాదు, వీటిలో ప్రయాణికుల సౌకర్యార్ధం అన్నిరకాల ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
ఇందులో ఒక ట్రైన్ తూర్పున పశ్చిమబెంగాల్‌లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగుళూరు మధ్య నుంచి ఏపీ మీదుగా నడుస్తోంది. రెండో ట్రైన్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి బీహార్‌లోని దర్భంగా మీదుగా ప్రయాణం సాగిస్తుంది.