Kodali Nani : రాధాకృష్ణ వచ్చుంటే కీళ్లు విరగొట్టేవాళ్లం!

Kodali Nani

Kodali Nani

Kodali Nani : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ప్రత్యర్థి పార్టీల నేతలను చిన్నాపెద్దా లేకుండా ఇష్టారీతిన బూతులు తిడుతూ మీడియాలో వైరల్ అవుతుంటారు. నానికి తిట్ల దండకం వల్లెవేయడం కొత్తేమీ కాదు. ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడుతారో అదే తీరుగా అసెంబ్లీలోనూ మాట్లాడుతారు. బూతులు లేకుండా ఆయన ఒక్క మాట మాట్లాడలేరు. ఇక ఆయన బూతులకు ప్రత్యర్థి పార్టీల నేతల కొందరు ఆయన భాషలోనే స్పందిస్తారు. ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ వేసే ప్రతీ ప్రసంగంలోనే నాని మార్క్ బూతు మాటలు కంపెల్సరీ. ఇక ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసే మీడియాపై కూడా ఆయన దురుసు తనం ఎక్కడా తగ్గదు. తాము చేసినా పనిని సమర్థించుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడరు. అదే ఒప్పు అయినట్టు మాట్లాడుతుంటారు.

ఇక మొన్నటి సిద్ధం సభలో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడిపై కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర అహంకారపూరితంగా ఉన్నాయనే చెప్పవచ్చు. మీడియా అంటే పల్లె నుంచి ప్రపంచం దాక ప్రతీ విషయాన్ని ప్రజలకు చూపించేది. వైసీపీ సభను కవర్ చేసేందుకు వెళ్లిన ఫొటోగ్రాఫర్ వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. దీనిపై ఏదో తప్పు జరిగింది, ఇకపై అలా జరుగదు అని చెప్పకుండా మరిన్ని దాడులు జరుగుతాయి అని చెప్పడం మీడియా హక్కులను కాలరాయడమే. ఇంతకీ ఆయన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే..

‘‘ఏబీఎన్ విలేఖరి కాబట్టి కొట్టి వదిలేశారు..అక్కడికి రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాడు వచ్చుంటే కీళ్లు విరగొట్టేవాళ్లం.. జగన్ దొంగ అని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని చంద్రబాబు తరుపున చెప్పేవాళ్లు ఎవరు ఈ చానెళ్లు వాళ్లే.. అందుకే కొట్టి వదిలారు.. పది లక్షల ముందు మందికి వస్తే కార్యకర్తలు కొట్టరా.. జగన్ తిట్టిన వారిని కొట్టరా..మేం ఆపితే ఊరుకుంటారా.. మేం కంట్రోల్ చేయగలమా? మేం ఆ చానెళ్లను బ్యాన్ చేశాం అయినా అక్కడికి ఎందుకు రావాలి.. రిపోర్టర్ కాబట్టి కొట్టి వదిలేశారు..అదే రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాడు వచ్చుంటే కీలుకు కీలు, వేలుకు వేలు తీసేవారు.. దయచేసి వైసీపీ పబ్లిక్ మీటింగ్ లకు మీడియా వస్తే రండి కాని.. ఈటీవీ, ఏబీన్, మహా న్యూస్, టీవీ 5 వంటి లోగోలు పట్టుకు రాకండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

TAGS