Aadhaar Card Update : ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..మీ ఊళ్లోనే ఇక అప్ డేట్..

Aadhaar Card Update

Aadhaar Card Update

Aadhaar Card Update : ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాధాన్యం మరే కార్డుకు లేదనే చెప్పాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు అర్హుల ఎంపిక, బ్యాంకింగ్, ఇతర సేవలకు పౌరులకు గుర్తింపు కార్డు ఆధార్ ఉంది. మనం ఏ అధికార కార్యక్రమాలకు నమోదు చేసుకోవాలన్నా అధార్ కార్డు అత్యంత అవశ్యకం. ఈ ఆధార్ కార్డును ప్రారంభించి ఇప్పటికీ దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. అయితే కొందరు ఇంకా వీటిని అప్ డేట్ చేసుకోలేదు.

ఆధార్ అప్ డేట్ ఇతర వ్యక్తులకు సంబంధించిన ఏవైనా కొత్త అంశాల చేర్పు అంటే..ఫొటో అప్ డేట్, అడ్రస్ ఛేంజ్, వివరాల్లో తప్పుల సవరణ..ఇలా పలు అంశాలను కార్డును అప్ డేట్ చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. వీటినే రేషన్ కార్డు ఈకేవైసీలోనూ, ఇతర బ్యాంకింగ్ కార్యక్రమాల ఈకేవైసీలోనూ ఆధార్ లింక్ తప్పనిసరి. అయితే ఏపీలోని చాలా మంది ఇంకా అప్ డేట్ చేసుకోకపోవడంతో ప్రభుత్వ పథకాల్లో వారికి ఇబ్బందులు తప్పదు. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వారి కోసం ప్రభుత్వం తాజాగా ఓ శుభవార్త చెప్పింది.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి(ఫిబ్రవరి 20) 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఏపీ అధికారులు వెల్లడించారు. ఆధార్ అప్ డేట్ తో పాటు అన్ని రకాల సేవలు ఉచితంగా అందించనున్నట్లు వారు తెలిపారు. ఆధార్ తీసుకుని పదేళ్లయిన వారు కచ్చితంగా అప్ డేట్ చేసుకోవాలని UIDAI నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టులో తేల్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో  1.49 కోట్ల మంది వివరాలను అప్ డేట్ చేసుకోలేదు.

కాగా, ఆధార్ అప్ డేట్ కోసం పట్టణాల్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి జనాలు ఇబ్బందులు పడేవారు. అక్కడ భారీ క్యూలతో గంటల తరబడి పడిగాపులు కాసేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు. గ్రామాల్లోనే ఆధార్ అప్ డేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కోటిన్నర మందికి ఇది కచ్చితంగా శుభవార్తే.

TAGS