Nara Lokesh : రిషికొండ భవనాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తాం: నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : సీఎం జగన్‌ కుచి ప్ పాడైందని.. రా ప్తాడు ‘సిద్ధం’ సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయ మన్నారని, ఒకకేళ ఆయనకు రేచీకటి ఉందేమోనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్  ఆరోపించారు. సోమవారం గాజువాక నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరి ద్రం జగన్ అని మండిపడ్డారు. రుషికొండకు బోడి గుండు కొట్టి.. అక్కడ భవనాలు నిర్మించ డానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

2 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ భ వనాలను ప్రజా అవసరాల కోసం వాడుతామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగ కుండా చూస్తామని, వాటికి సంబంధించిన భూము లను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. జగన్‌ను ఫుట్‌ బాల్ ఆడే సమయం వచ్చిందని నారా లోకేశ్ వా ర్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక భస్మాసురుడని, ఐరెన్ లెగ్ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నాప్ , హత్యలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

TAGS