Vundavalli Arun Kumar : ‘ఉండవల్లి’ నోట ఎవరూ ఊహించని మాట!
Vundavalli Arun Kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నాయకుడే కాదు మంచి మేధావి అని అందరూ అంటుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ప్రస్తుతం ప్రెస్ మీట్లు, విశ్లేషణలు గట్రా పెడుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అయన దగ్గర లాజిక్ పర్సనే కాదు మంచి మాటకారి కూడా. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని జగన్ రెడ్డికి ఎంతో శ్రేయోభిలాషైన ఉండవల్లి జోస్యం చెప్పడం విశేషం. ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ చానళ్లతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అయితే విభజన చట్టం పాసై పదేళ్లు అయిన సందర్భంగా రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టును చూపిస్తే.. పోలవరం ప్రాజెక్టును చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ విమర్శించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వారానికోసారి ప్రెస్ మీట్ పెట్టి పోలవరం పనులపై ఆరోపణలు చేసేవారు ఉండవల్లి. ఏవో కొన్ని ఫొటోలు చూపించి ఇవిగో క్రాకులొచ్చాయని.. అదనీ..ఇదనీ.. ఆరోపించేవారు. ఇప్పుడు పనులు జరుగకపోయినా మాట్లాడడం లేదు. అయితే ఇప్పుడు ఆయనకు క్లారిటీ వచ్చిందేమో కానీ.. చంద్రబాబు గెలుస్తారంటున్నారు. కానీ జగన్ రెడ్డి అన్యాయ పాలనకు జగన్ విసిగిపోయారని మాత్రం చెప్పడం లేదు. చంద్రబాబు జైలుకు వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని చెప్పుకొచ్చారు.
విభజన.. చట్టం ప్రకారం జరుగలేదని.. లోక్ సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయని పేర్కొన్నారు. ఏపీ విభజన తప్పా, ఒప్పా తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టునే అడుగుతున్నానని చెప్పుకొచ్చారు. ఏపీ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బంధం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం జగన్ ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.