Telangana Bill : లోక్ సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి పదేండ్లు

Telangana Bill

Telangana Bill

Telangana Bill : ఎన్నో చీత్కారాలు.. మరెన్నో అవమానాలు.. ఎంతో దోపిడీ.. మరెంతో వెనుక బాటుతనం కలగలిపి తెలంగాణ కన్నీరు పెట్టింది. తెలంగాణ తల్లిని దాస్య శృంకలాల నుంచి విముక్తి కల్పించేందుకు ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఇవన్నీ వెరిసి తెలంగాణ ప్రజల కల సాకారమై తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ బిల్లు పాసై పదేండ్ల గడిచిన సందర్భంగా ఉద్యమంపై టూకీగా..

తెలంగాన ఏర్పాటు ఉద్యమం రెండు దశలుగా సాగింది. ఒకటి తొలి దశ ఉద్యమం అయితే.. రెండోది మలిదశ ఉద్యమం. 1969లో ఉద్యమం మొదలైంది. ఖమ్మంలోని పాల్వంచ థర్మల్ స్టేషన్ లో పని చేసే ఉద్యోగుల్లో మేజారిటీ వారు ఆంధ్రప్రాంతం నుంచే ఉండడంతో 1969, జనవరి 5వ తేదీ తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు.  ఇక్కడి నుంచి మొదటి అడుగు పడింది. ముల్కీ నిబంధనలను కాలరాస్తూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన అనేక మంది తమ ఉద్యోగాలను తీసుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి పోచంపాడు ప్రాజెక్ట్ కోసం రూ. 100 కోట్లు ఇవ్వాలని, దీనితో పాటు పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 10న ఉద్యమం ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ)కి చేరింది. దీంతో అక్కడ తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. ఇలా ఉద్యమం పెరుగుతూ పోయింది. ఆ తర్వాత జరిగిన ఘటనల్లో పోలీసులకు ఉద్యమ కారులకు మద్య జరిగిన దాడుల్లో శంకర్ అనే యువకుడు గాయాలపాలై చికిత్స పొంది మరణించాడు. తొలి తెలంగాణ అమరవీరుడు శంకర్.

2021లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో ఉద్యమం మరో కార్యాచరణ ప్రారంభించింది. ఇదే మలి దశ ఉద్యమంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమం బాట పట్టారు. ఆయన వెంట ప్రజలు నడవడంతో రాష్ట్రాన్ని ఇవ్వడం కేంద్రాన్ని ఇవ్వడం అనివార్యంగా మారింది.

దీంతో 2013, జూలై 31న తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం అంత పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. 2 జూన్, 2014న 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో దాస్య శృంఖలాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి పొందింది.

TAGS