Keerthi Suresh : లిప్ లాక్ ఇష్టం లేకనే.. యంగ్ హీరో సినిమా రిజెక్ట్ చేసిన కీర్తి!
Keerthi Suresh : టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో కీర్తిసురేశ్ కు మంచి క్రేజే ఉంది. తమిళ ఇండస్ట్రీ నుంచి దిగుమతైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆతర్వాత తెలుగులో డబ్ అయిన శివకార్తికేయన్ ‘రెమో’ మూవీతో యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఆ సినిమాలో ఆమె అందానికి ఫిదా కాని వారు ఉండరనే చెప్పాలి.
అందంలోనూ, అభినయంలోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కీర్తిసురేశ్ కు చిన్న వయస్సులోనే, కెరీర్ తొలినాళ్లలోనే సావిత్రి బయోపిక్ లో సావిత్రమ్మ పాత్ర దొరకడం.. మహానటిగా వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ కావడం.. కీర్తి నటిగా మరో మెట్టు ఎక్కేసింది. ఈ సినిమాకు జాతీయ నటి అవార్డు రావడం..ఆమె అభినయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూనే ఉంది. బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవుతోంది.
అయితే కీర్తిసురేశ్ .. కెరీర్ తొలినాళ్లో తెలుగు యంగ్ హీరో నుంచి వచ్చిన పెద్ద అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. కొత్త హీరోయినే ఇలా చేసిందేమిటి? అని అప్పట్లో సినీ జనాలు నివ్వెరపోయారు. అయితే ఆ సినిమా ఒప్పుకోకపోవడానికి కీర్తిసురేశ్ తనకు తాను విధించుకున్న కండీషన్ల వల్లనే అని ఆమె గురించి తెలిసిన వారు చెపుతారు. వాస్తవానికి కీర్తిసురేశ్ ఈమధ్య కాస్త గ్లామర్ ఒలకబోస్తోంది కానీ.. గత సినిమాల్లో ఏమాత్రం ఎక్స్ పోజ్ లేకుండానే నటించేసింది. గ్లామర్ కంటే నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంది.
ఈక్రమంలో కెరీర్ తొలినాళ్లలో తెలుగు యంగ్ హీరో నితిన్ భారీ బడ్జెట్ సినిమాలో కీర్తిని నటించాలని మేకర్స్ కోరారు. అయితే అందులో లిప్ లాక్ సీన్లు ఉండడంతో వెంటనే నో చెప్పిందట. తాను ఆ సీన్లు ఉంటే నటించనని తెగేసి చెప్పిందట. నితిన్ తో నటించడం ఇష్టమే కాని లిప్ లాక్ లు ఇష్టం లేదందట. అయితే ఆ తర్వాత ఇద్దరు కలిసి ‘రంగ్ దే’ అనే సినిమాలో నటించారు.