BRS Party Leader : బీఆర్ఎస్ పక్క చూపులు.. కాంగ్రెస్, బీజేపీలోకి మరింత మంది!!

BRS Party Leader

BRS Party Leader

BRS Party Leader : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికి కోసం పోరాడుతోందని బీజేపీ, కాంగ్రెస్ పదే పదే చెబుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత సిట్టింగ్ ఎంపీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది.

అయితే తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనను బట్టి చూస్తే బీఆర్ఎస్ నేతల పక్క చూపులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని, వారు బీజేపీలో చేరేందుకు బీజేపీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ బహిరంగంగానే చెప్పారు.

బండి మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావును కూడా పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. అలా జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను ఎన్డీయేలో చేరనివ్వలేదని, అవమానం తర్వాత ఇప్పుడు ఆయన పార్టీని ఎన్డీయేలో ఎందుకు చేరనివ్వాలని ప్రశ్నించారు. అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మరింత మంది బీఆర్ఎస్ నుంచి దూరమైతే పార్టీ దాదాపు ఐదేళ్ల వరకు తన నాయకత్వాన్ని, కేడర్ ను తీవ్రంగా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొనసాగుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ రాష్ట్రంలో మరింత క్షీణంచే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS