Devineni Avinash : తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా?:దేవినేని అవినాష్
Devineni Avinash : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అందుకు నిదర్శనమే తూర్పు నియోజకవర్గం అని ఆ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ అని అసత్య ప్రచారా లు చేస్తున్న టీడీపీ పార్టీ, దాని అనుకూల తోక పత్రికలు దమ్ముంటే తూర్పు నియోజకవర్గంలో పర్యటించాలని వారికి అభివృద్ధి ఎక్కడ జరిగింద నేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని అవినాష్ సవాలు విసిరారు.
శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ నెహ్రూ నగర్, గౌతమీ నగర్ ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో కలిసి అవినాష్ గడప గడపకి కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభు త్వంలో చేపట్టిన సంక్షేమాభి వృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి, అభివృద్ధి కార్యక్రమాలను “మీ అవినాష్ అన్న హామీ” పేరు తో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నాం అని అన్నారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పాలన అందిస్తూ 95 శాతం పైగా హామీలను నెరవేర్చడం జరిగిందని ఆయన అన్నారు. గడపగడపకు వస్తున్న వైసీపీ నాయకులకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రజలకు పాలన పట్ల ఎంత సంతృప్తి ఉంది అనేది అర్థం అవుతుం దన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి తో పాటు మరలా అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరిస్తూ మా కార్యక్రమం సాగుతోంది అని తెలిపారు.
*సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ నెహ్రూ నగర్ 2వ లైన్ వద్ద 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిదులతో నూతనం గా చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణానికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన నిర్వహించారు. ఈ సంద ర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ ప్రాంతావాసులకు ఎంతో అభిమానమని అందుచేత గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు రెండో ఫేజ్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరే షన్ చైర్మన్ అడపా శేషగిరి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ సుభాని,కార్పొరేటర్ రామిరెడ్డి,వైసీపీ నాయకులు పళ్లెం రవి,ఎన్,యస్,యు రాజు,గొర్ల గోవింద్,శర్మ మరియు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..