Good Foods : ఈ ఫుడ్ తీసుకుంటే..పడకగదిలో రాత్రంతా రెచ్చిపోతారు..

Good Foods

Good Foods

Good Foods : శృంగారంలో భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు పురుష పుంగవులు నానా కష్టాలు పడుతుంటారు. అందరికీ పడక గదిలో ‘తనంటే ఏంటో’ నిరూపించుకోవాలన్న కోరిక ఉన్నా ఒక్కోసారి ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. దీనికి కారణం జాబ్ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిత్యం ఏవో టెన్షన్స్, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం..లాంటి ఎన్నో కారణాల వల్ల వారి కోరిక తొందరగానే నీరుగారిపోతుంది.

తిండి కలిగితే కండ కలదోయ్ అని గురజాడ వారు చెప్పినట్టుగా మంచి తిండి ద్వారా కూడా మీ లైంగిక పటుత్వాన్ని, సామర్థ్యాన్ని, రొమాంటిక్ మూడ్ ను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం, యోగా, మెడిటేషన్ , వ్యాయామం ద్వారా హర్మోన్ల సమతుల్యంతో శృంగారానికి ఫిట్ గా తయారవుతారు. అందులో కొన్నింటిని చూద్దాం..

డార్క్ చాక్లెట్ :
ఇది మీ మూడ్ ను రొమాంటిక్ మార్చడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కెఫీన్ మీలో ఉత్తేజితాన్ని రగిలిస్తుంది. అలాగే రక్తప్రసరణను కాస్త వేగపరుస్తుంది. వీటితో పాటు దీని రుచి ద్వారా మధురానుభూతి కలుగుతుంది. తద్వారా మీ మనసు శృంగారాన్ని కోరుకుంటుంది.

కాయగూరలు:
ఫైబర్ పుష్కలంగా ఉండే కాయగూరలు తినడంతో మీ శరీరంలో టెస్టోస్టిరాన్ హర్మోన్ సమపాళ్లలో విడుదలై మూడ్ రొమాంటిక్ గా మారుతుంది.

చేపలు:
చేప మాంసం తినడం ద్వారా మీ రక్తంలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి. తద్వారా మంచి కొలెస్ట్రాల్ ఏర్పడడంతో పాటు క్వాలిటీ కూడా పెరుగుతుంది.

అవిసె గింజలు:
వీటిని మీ రెగ్యులర్ మీ డైట్ లో చేర్చుకుంటే మీ మూడ్ రొమాంటిక్ మారేందుకు సహాయపడుతుంది.

పండ్లు:
బెర్రీ , స్ట్రాబెర్రీ, అవకాడో వంటి పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే మీ మూడ్ రొమాంటిక్ గా మారుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ను ఈ పండ్ల ద్వారా పొందవచ్చు. తద్వారా మీ లైంగిక సామర్థ్యం పెరిగి మీ భాగస్వామిని తృప్తి పరచవచ్చు.

పైన చెప్పిన ఫుడ్ కాకుండా మీ మెదడును, శరీరాన్ని శృంగారానికి సిద్ధంగా ఉంచడం ప్రధానం. మీ భాగస్వామితో రొమాంటిక్ టాక్స్ ద్వారా శృంగారానికి ఆమెను సిద్ధం చేయవచ్చు.

TAGS