Jagan-Revanth : రాజధానిపై వైసీపీ తాజా ప్లాన్ ! రేవంత్ తో పంచాయితీకి రెడీ..?

Jagan-Revanth

Jagan-Revanth

Jagan-Revanth : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు తరుముకుని వస్తున్నాయి. అసలే అమరావతి స్దానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా అస్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తోంది.

ఏపీ రాజధానిగా ఇప్పటికీ అమరావతి కొనసాగుతోంది. అయితే సుప్రీంకోర్టుకు చేరిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హైదారాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్దమవుతోంది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాబోతున్న వైసీపీ సీని యర్ నేత వైవీ సుబ్బారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై తమ వ్యూహం ఏంటో ఆయన చెప్పకనే చెప్పేశారు.

ఏపీ-తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ తో ముగియబోతోంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్త ర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి హింట్ ఇచ్చారు.

ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్ధితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీసీ ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబీయింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కూలిపోనుందంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై కచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తిన్నాయి.

TAGS