Top Websites : ఎక్కువ మంది చూసే వెబ్ సైట్స్ ఇవే..‘ఆ’ వెబ్ సైట్ కు కోట్లలో ఫాలోవర్స్!
Top Websites : స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్..ఈ రెండు ప్రతీ మనిషికి రెండు కళ్లలాగా అయిపోయాయి. చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు వారి వారి అవసరాల మేరకు ఈ రెండూ ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీ వినియోగంతో పనిలో వేగం, కచ్చితత్వం, మెరుగుదల వచ్చిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వచ్చింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల మారుమూల పల్లె సైతం గ్లోబల్ వరల్డ్ తో నెట్ వర్కింగ్ లోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ వల్ల హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏ సౌకర్యం అందుతుందో.. మహదేవ్ పూర్ అడవుల్లో సైతం అదే సౌకర్యం అందుతోంది. టెక్నాలజీకి ధనిక, పేద అనే తారతమ్యం లేకపోవడం.. అతి తక్కువకే డాటా రావడంతో భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
స్మార్ట్ ఫోన్ తో వ్యక్తులు తమ అభిరుచుల మేరకు ఇంటర్నెట్ ను వాడుతుంటారు. వ్యవసాయం నుంచి వ్యాపారం దాక..భూపటలం నుంచి అంతరిక్షం దాక..ఇలా ప్రతీ అంశంపై సమాచారం మనకు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ ను సెర్చ్ చేసి సందేహాలు తీర్చుకుంటున్నారు. ప్రయాణం చేయడానికి గూగుల్ మ్యాప్ ను వాడుతున్నారు. ఏదైనా విషయంపై విశ్లేషణ వినడానికి, ఎంటర్ టైన్ మెంట్ సహ అన్ని రకాల వీడియోల కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ తోనూ, మిగతా సమాజంతోనూ టచ్ లో ఉండడానికి, తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్..ఇలా సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు.
రీసెంట్ గా జనవరి నెలకు సంబంధించిన ఓ సర్వేలో సంచలన విషయం వెల్లడైంది. జనవరిలో నెలలో అతి ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ పేరుతో సర్వే చేశారు. దీనిలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది గూగుల్ ను విజిట్ చేశారట. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, బాయ్ డు, వికీపీడియా, Yahoo.com, Yandex.ru తో పాటు వాట్సాప్ ను వినియోగించినట్టు ‘సిమిలర్ వెబ్’ అనే సంస్థ తెలిపింది. ఇక 11వ ప్లేస్ లో Xvideos.com ఉందని పేర్కొంది. మరి మీరు ఈ వెబ్ సైట్ లో దేన్ని ఎక్కువగా ఫాలో అవుతారో కామెంట్ చేయండి మరి.