Richest Hero’s : పది మంది హీరోలు..వేల కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ధనిక సినిమా ఫ్యామిలీ వీళ్లదే..!

Richest Hero's

Richest Hero’s, Mega Family

Top Ten Richest Hero’s Family’s : మన దేశంలో వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు వారసత్వం కామనే. ఏ రంగంలో ఉన్నా తమ పిల్లలు కూడా అదే రంగంలో రాణించాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ తన ఆస్తులను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలకు..వీరు తమ వ్యాపారాలను వారి పిల్లలకు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఇక రాజకీయ రంగంలో కూడా తాము రిటైర్ అయి తమ పిల్లలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగానో సీట్లు ఇప్పించుకుంటారు. మన దేశంలో వారసత్వ పార్టీలే ఎక్కువ అని మనకు తెలిసిందే.

ఇలా ఏరంగం చూసిన వారసులే కనపడుతుంటారు. దీనికి సినిమా రంగం మినహాయింపు కాదు. దేశంలో ఎన్నో సినిమా కుటుంబాలు ఉన్నాయి. కపూర్ల కుటుంబం, మెగా కుటుంబం, అక్కినేని కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం, కన్నడ లో రాజ్ కుమార్ కుటుంబం..అయితే వీటిల్లో ఎవరి కుటుంబం పాపులారిటీ పరంగానూ, ఆస్తిలో గానూ నంబర్ వన్ పొజిషన్ లో ఉంటుందో అనే సందేహం అభిమానులకు కలుగుతుంటుంది. ఈ కుటుంబాల్లో అత్యంత ధనిక కుటుంబం మన తెలుగు సినిమా వారిదే కావడం విశేషం.

ఈ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తి విలువ కపూర్స్, అక్కినేని వారి కంటే చాలా ఎక్కువ. ఈ తెలుగు సినిమా ఫ్యామిలీలో నలుగురు సూపర్ స్టార్లు, మిగతా వారు మీడియం రేంజ్ హీరోలు, అగ్రనిర్మాతలు, నటీమణులు ఉన్నారు. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిదో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే మన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం. దేశంలోనే అత్యంత ధనిక సినిమా కుటుంబం కొణిదెల-అల్లు వారిదే. ఈ కుటుంబాన్ని ‘మెగా ఫ్యామిలీ’, ‘మెగా కంపౌండ్’ అని పిలుస్తారనేది చెప్పక్కర్లేదు.

మెగా ఫ్యామిలీ తెలుగు చిత్రసీమను శాసిస్తుందనడంలో డౌటే అక్కర్లేదు. దేశంలోనే ప్రముఖ సినీ కుటుంబంగా పేరొందింది. ఈ కుటుంబంలో నలుగురు సూపర్ స్టార్లలో ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్లు రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఉన్నారని తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, అల్లు స్టూడియో వంటి 5 నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నాగబాబు, నిహారికి వంటి నటులు ఉన్నారు. అయితే చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మార్కెటే ఎక్కువ. మొత్తం మెగా ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ.6వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దేశంలోనే నటుల పరంగానూ, ఆస్తుల పరంగానూ మెగా ఫ్యామిలీ నంబర్ వన్ గా నిలువడం కోట్లాది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి ప్రతిష్ఠాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిరు ‘విశ్వంభర’, పవన్ ‘ఓజీ’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’ లాంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ లే. ఈ సినిమాలతో మెగా ఫ్యామిలీ పేరు దేశ వ్యాప్తంగా మరింత వెలిగిపోనుంది.

TAGS