RGV-Chandrababu : చంద్రబాబుకు కలిసి రాని నెంబర్.. ఇదేనంటూ వర్మ ట్వీట్..
RGV-Chandrababu : చంద్రబాబు నాయుడు.. రాంగోపాల్ వర్మకు ఎక్కడ చెడిందో తెలియదు గానీ. బాబు అంటేనే ఫైర్ అవుతాడు వర్మ. కానీ బాబు మాత్రం వర్మను పట్టించుకోడు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పటికీ చంద్రబాబు పొలిటికల్ ఇమేజ్ పై దెబ్బ కొట్టేందుకు గతంలో సినిమా చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎన్నికల వేల కోర్టు ఆ సనిమా రిలీజ్ ను ఆపివేసింది.
ఇదంతా పక్కన పెడితే గతంలో చర్చకు వచ్చిన విషయం చంద్రబాబుకు కలిసి రాని నెంబర్ ను రాంగోపాల్ వర్మ తన ఎక్స్ (ట్విటర్)లో పెట్టాడు. దీన్ని చూసిన నెటిజన్లు, టీడీపీ అభిమానులు, వైసీపీ ఫాలోవర్స్ ఎవరికి వారు కామెంట్లు పెడుతున్నారు. అయినా ఈ నెంబర్ గురించి గతంలో చంద్రబాబు జైలులో ఉండగానే బయటకు వచ్చింది. చంద్రబాబుకు నెం. 23 అస్సలు కలిసిరాదని వర్మ కూడా అదే విషయాన్ని ట్విటర్ పిట్టతో కూయించాడు.
బాబుకు కలిసిరాని నెంబర్.. 23
1. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.
2. 2019 ఎన్నికల ఫలితాల వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23.
3. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాల సంఖ్య కేవలం 23.
4. బాబు అరెస్టయిన తేదీ 09.09.23.. సమ్ అఫ్ అల్ దీస్ నెంబర్స్ = 23.
5. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 2023, సెప్టెంబర్ 23వ తేదీ వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చిన సీబీఐ కోర్టు.
6. బాబు ప్రిజన్ నెం. 7691 సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23.
7. చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టిన రోజు 23.
8. ‘వ్యూహం’ జగగర్జన ఈవెంట్ తేదీ 23,
9. ‘వ్యూహం’ సినిమా రిలీజ్ తేదీ 23.
ఇలా చాలా అంశాల్లో చంద్రబాబుకు నెం. 23కు అవినాభావ సంబంధం ఉందని వర్మ ట్వీట్ చేయగా.. నెటిజన్లు భిన్నంగా వారి అభిప్రాయాలను వివరించారు.
CBN లక్కీ నెంబర్ 23
1.
వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు 23 మంది
2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd
3. Babu గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23
4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ….. సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23
5.…
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024