Lavanya Tripathi : అక్కినేని ఫ్యామిలీ కి చావు దెబ్బ కొట్టిన లావణ్య త్రిపాఠి!
Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ లోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి నుండి విడుదలైన వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఈ సిరీస్ కి నెటిజెన్స్ నుండి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. లావణ్య త్రిపాఠి లాంటి స్టార్ హీరోయిన్ ని పెట్టుకొని ఇంత రొటీన్ వెబ్ సిరీస్ ఎలా తీశారు?, యూట్యూబ్ లో ప్రసారమవుతున్న షార్ట్ ఫిలిమ్స్ ఎంతో బెటర్ గా, సరైన ట్విస్టులు, స్క్రీన్ ప్లే తో ఉంటుంది కదా, కనీసం వాళ్ళని చూసి అయినా నేర్చుకోవచ్చు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడ్డారు.
లావణ్య త్రిపాఠి పెళ్ళికి ముందు జీ 5 యాప్ కోసం ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కి నెటిజెన్స్ నుండి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ కారణం చేత ఈ సిరీస్ కి కూడా క్రేజ్ ఏర్పడింది. పైగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కూడా ఈ సిరీస్ లో ఉండడం తో ఆడియన్స్ అమితాసక్తిని చూపించారు.
కాని ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ఈ సిరీస్ ని అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఈమె అక్కినేని సుమంత్ కి సోదరి, పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరంగా వ్యాపారం రంగం లో రాణిస్తూ వచ్చింది. చాలా కాలం తర్వాత ‘గూఢచారి’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన సుప్రియ, అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతని కూడా మొత్తం తానే మోస్తుంది. ఆ తర్వాత సినిమాలు , వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తూ వచ్చిన సుప్రియ కి ఈ ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ భారీ నష్టాలను కలిగించింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
దీంతో అటు పెళ్లి అయ్యాక మెగా ఫ్యామిలీ కి, అక్కినేని ఫ్యామిలీ కి కలిపి ఒక డిజాస్టర్ ని అందించిన ఆమె గా లావణ్య త్రిపాఠి నిల్చింది. ఇక తదుపరి సినిమా/ వెబ్ సిరీస్ అయినా మంచి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలని, సమయం పట్టినా పర్వాలేదు మంచి కంటెంట్ తో రమ్మని లావణ్య త్రిపాఠి అభిమానులు సోషల్ మీడియా లో ఆమెని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు.