Fighter : భారీ బడ్జెట్ సినిమాతో భారీ నష్టాలు.. తల పట్టుకుంటున్న బయ్యర్లు..

Huge losses with big budget movie..

Huge losses with big budget movie..

Fighter : ప్రతీ ఏటా సినీ ఇండస్ట్రీలో డిజాస్టర్లు, బ్లాక్ బస్టర్లు కామనే. అయితే సాధారణంగా సూపర్ హిట్స్ కంటే అట్టర్ ఫ్లాప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్ తో మొదలైంది. సూపర్ హిట్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతుందని భావించిన ‘ఫైటర్’ సినిమా భారీ నష్టాల దిశగా పయనిస్తోంది.

హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ రిపబ్లిక్ డే (జనవరి 26) స్పెషల్ గా విడుదలైంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. రిపబ్లిక్ డే నుంచి వచ్చిన ఊపు వేగంగా క్షీణించడంతో ఆ తర్వాత థియేటర్లకు ప్రజలు రావడం తగ్గుతూ పెరుగుతూ వచ్చింది.

నిన్నటితో 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా రూ.189 కోట్ల నెట్ ను రాబట్టింది. రూ.275 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో అధిక రేట్లకు అమ్ముడు పోయినప్పటికీ ఇప్పటి వరకు కేవలం రూ. 189 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ‘ఫైటర్’ ఆక్యుపెన్సీ రేటు తగ్గింది, ఒక రోజు ముందు కేవలం 13.97 శాతం మాత్రమే నమోదైంది.

ఈ సినిమా ఈ రోజు రోజుకు థియేటర్లలో తన ఉనికిని నిలుపుకునేందుకు కష్టపడుతూనే ఉందని ఇప్పుడు స్పష్టమవుతోంది. దీంతో ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

శుక్రవారం ఈ చిత్రం దేశ వ్యాప్తంగా రూ.81 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.300 కోట్లు దాటినా ఈ మూవీ భారీ నష్టాలను చవిచూడటం ఖాయంగా కనిపిస్తోంది.

TAGS