11th February Horoscope : నేటి రాశి ఫలాలు
మేష రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గా శ్లోకం చదవడం మంచిది.
వ్రషభ రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంతో కాలం గడుపుతారు. మనోబలంతో ముందడుగు వేస్తారు. చంద్ర శ్లోకం చదవడం మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రశంసలు దక్కించుకుంటారు. దుర్గా దేవి ఆరాధన శుభకరం.
కర్కాటక రాశి వారికి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ స్తోత్రం చదవడం శ్రేయస్కరం.
సింహ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మంచి ఫలితాలున్నాయి. కుటుంబంలో సానుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన శక్తిని పెంచుతుంది.
కన్య రాశి వారికి మాటకు విలువ ఉంటుంది. సమయానికి సాయం చేసే వారుంటారు. ఆర్థిక లాభాలుంటాయి. ఇష్టదేవతారాధన శ్రేయోదాయకం.
తుల రాశి వారికి కొందరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనిలో మంచి ఫలితాలుంటాయి. సూర్య నమస్కారం మీలో నమ్మకాన్ని పెంచుతుంది.
వ్రశ్చిక రాశి వారికి అనవసరంగా గొడవలకు వెళ్లకండి. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు. నవగ్రహ ధ్యానం చేయడం శుభకరం.
ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశంసలు దక్కుతాయి. శ్రీరామ దర్శనం మేలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అందరిని నమ్మకూడదు. సూర్యనమస్కారాలు మేలు కలిగిస్తాయి.
కుంభ రాశి వారికి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలు కలిగిస్తాయి.
మీన రాశి వారికి ఒక విషయంలో నిర్ణయం అనుకూలంగా తీసుకుంటారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి పూర్తిచేస్తారు. దుర్గాదేవి ఆరాధన మంచిది.