Comedian Sunil : ఉచితంగా సినిమాలు చేస్తున్న కమెడియన్ సునీల్..పాపం ఇలా పడిపోయాడేంటి!
Comedian Sunil : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడానికి ఎన్నో కష్టాలు పడి కనీసం తిండి, నీళ్లు కూడా లేకుండా గడిపిన రోజుల నుండి నేడు ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా నిల్చిన సునీల్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి భీమవరం నుండి హైదరాబాద్ కి సినిమా అవకాశాల కోసం వచ్చాడు. మొదట్లో అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా ఇద్దరు కలిసి తిరిగారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అవకాశం వచ్చింది. ఆ తర్వాత సునీల్ కి వచ్చింది.
ఇండస్ట్రీ లో విలన్ అవ్వాలనే కోరిక తో వచ్చిన సునీల్, చివరికి కమెడియన్ అయ్యాడు. కమెడియన్ గా ఈయన చూసిన ఎత్తుపల్లాలు నేటి జనరేషన్ కమెడియన్స్ లో ఎవ్వరూ చూడలేదు. ఒకానొక సందర్భం లో సునీల్ దెబ్బకి బ్రహ్మానందం లాంటి లెజెండ్ కి కూడా అవకాశాలు తగ్గిపోతాయా అనే రేంజ్ లో ఉండేది డిమాండ్.
కానీ మధ్యలో ఆయనకీ హీరో అవ్వాలనే కోరిక పుట్టింది, హీరో గా చేసిన మొదటి సినిమా ‘అందాల రాముడు’ కమర్షియల్ గా అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. హీరో గా అంత సక్సెస్ అయ్యాక కూడా మధ్యలో ఆయన కమెడియన్ గా పలు సినిమాలు చేసాడు. ఆ తర్వాత ఆయన హీరోగా చేసిన ‘మర్యాద రామన్న’ పెద్ద హిట్ అవ్వడం తో మళ్ళీ హీరో గానే కొనసాగాడు.
మర్యాద రామన్న తర్వాత ఆయన హీరో గా చేసిన ‘పూలరంగడు’ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆయన హీరోగానే కొనసాగుతూ వచ్చాడు. కానీ వరుస ఫ్లాప్స్ ఎదురు అవ్వడం తో మళ్ళీ కమెడియన్ గా మారాడు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా ఈమధ్య ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ లలో కూడా ఆయనకీ అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే సునీల్, చిన్న సినిమాలకు అసలు రెమ్యూనరేషన్ తీసుకోదట.
రీసెంట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమాలో సునీల్ ఒక చిన్న క్యారక్టర్ చేసాడు. ఈ సినిమాకి సోహెల్ నిర్మాత కావడం తో అతని పరిస్థితి అర్థం చేసుకొని రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించాడట.