Pre Wedding Shoot : కర్ణాటకలో వింత చేష్ట.. ఆపరేషన్ థియేటర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్
Pre Wedding Shoot : ఎవరి పిచ్చి వారికి ఆనందం. మనిషికో రకంగా ఉంటుంది పిచ్చి. దీంతో వారి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా తనకు కాబోయే భార్యతో ఆస్పత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించి సస్పెండ్ కావడం గమనార్హం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్ కాబోయే భార్యతో కలిసి ఓ వ్యక్తికి ఆపరేషన్ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ తీవ్రంగా స్పందించి వైద్యుడిని విధుల నుంచి తొలగించారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా ఇలా ప్రవర్తించడం వెనుక పరిస్థితులు ఏమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అంటున్నారు.
వైద్యుడు అయి ఉండి కూడా ఇలాంటి చేష్టలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. హుందాగా ఉండాల్సిన డాక్టర్ ఇలాంటి వెర్రి వేషాలు వేయడం సరైంది కాదనే విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ చేసిన పనికి శాపనార్థాలు పెడుతున్నారు. రోగులకు సేవ చేయాల్సిన వైద్యుడు ఇలా ప్రీవెడ్డింగ్ షూట్ లు చేయడం విమర్శలకు తావిస్తోంది. అందుకే అతడిని విధుల నుంచి తొలగించారు.
ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటుంటే బాధ్యతలు సరిగా నిర్వహించాలి. కానీ చేసే పని పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడంతోనే అతడి జాబ్ పోయింది. చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. కానీ విధులు పక్కన పెట్టి వినోదాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడి ఉద్యోగం పోవడానికి కారణంగా నిలిచింది.