Eagle First day Collections : ‘ఈగల్’ మూవీ మొదటి రోజు వసూళ్లు..రవితేజ కి ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించి ఉండరు!

Eagle First day Collections

Eagle First day Collections

Eagle First day Collections : వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఈగల్ ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ అనకాపల్లి నుండి అమెరికా వరకు దంచి కొట్టాయి. వంద శాతం పరిపూర్ణమైన ఆక్యుపెన్సీలతో ఈ సినిమాకి వసూళ్లు నమోదు అయ్యాయి. నిన్న బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో గంటకి 8 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా మొదటి రోజు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోలేదు. రవితేజ కి ఈమధ్య కాలం లో ది బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. టాక్ బాగా రావడం తో సాయంత్రం షోస్ కి వేరే లెవెల్ లో ఆడియన్స్ క్యూలు కట్టారు.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజ కి ఆ రేంజ్ ఓపెనింగ్ ఈ చిత్రం తోనే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక ప్రాంతాలలో ఇది వరకు రవితేజ కి ఓపెనింగ్స్ బాగా వచ్చేవి కానీ, ఓవర్సీస్ లో మాత్రం ఆయనకీ పెద్ద వసూళ్లు వచ్చేవి కాదు. ఈ ప్రాంతం రవితేజ కి చాలా వీక్ ప్రాంతం అని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. అలాంటి ప్రాంతం లో కూడా ఈగల్ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ దక్కింది అంటే టాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి రెండు లక్షల డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇది రవితేజ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ మొదటి రోజు 2 లక్షల డాలర్స్ కంటే తక్కువ వసూళ్లు రాబట్టేవి. కానీ ఈ సినిమా మాత్రం అంచనాలను తలక్రిందులు చేసింది. అంతే కాకుండా ఈ సినిమా రవితేజ కెరీర్ లో మొట్టమొదటి 1 మిలియన్ డాలర్ చిత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

TAGS